గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (12:33 IST)

దేశంలోని ముఖ్యమంత్రుల్లో శ్రీమంతుడు ఎవరు?

దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరో తెలుసా? సాక్షాత్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ నిర

దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరో తెలుసా? సాక్షాత్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈయన చర, స్థిరాస్తులు రెండూ కలిపితే చంద్రబాబు వ్యక్తిగత సంపద రూ.177 కోట్లుగా ఏడీఆర్ లెక్కగట్టింది. 
 
ఏడీఆర్ వెల్లడించిన నివేదిక ప్రకారం చంద్రబాబుకు రూ.134,80,11,728 విలువైన చరాస్తులు, రూ.42,68,83,883 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.177,78,95,611 ఉన్నట్లు ఏడీఆర్‌ సంస్థ వెల్లడించింది. చంద్రబాబు తర్వాత రెండో ధనిక సీఎం... అరుణాచల్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ. ఈయన ఆస్తుల విలువ రూ.129కోట్లకుపైగా ఉంది. మూడో స్థానం పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ది.
 
ఇక 15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాలుగో ధనిక సీఎంగా ఉన్నారు. కేసీఆర్‌ దగ్గర రూ.6,50,82,464 విలువైన చరాస్తులు, రూ.8.65 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. సీపీఎంకు చెందిన త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ ఆస్తుల విలువ రూ.26 లక్షల 83 వేల 195 మాత్రమే. పేద సీఎంల జాబితాలో రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (రూ.30 లక్షలు), మూడో స్థానంలో జమ్మూ కాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ  (రూ.55 లక్షలు) ఉన్నారు. మమతా బెనర్జీ దగ్గర ఒక్క రూపాయి కూడా విలువ చేసే స్థిరాస్తి లేకపోవడం విశేషం.