ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (22:03 IST)

కేంద్రానికి మనం సహకరించాం- మనకు కేంద్రం సహకరించాలి... సీఎం చంద్రబాబు

మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్నివిధాలా సహకరించాం. జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు తదితర అంశాలలో అండగా నిలిచాం. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరింత సహకారం అందించాలి. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేదాకా కేంద్రం చేయూత

మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్నివిధాలా సహకరించాం. జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు తదితర అంశాలలో అండగా నిలిచాం. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరింత సహకారం అందించాలి. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేదాకా కేంద్రం చేయూత ఇవ్వాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
స్వాతంత్ర్య పోరాటం గత చరిత్ర- రాష్ట్ర ప్రయోజనాల పోరాటం ఇప్పటి చరిత్ర:
స్వాతంత్ర్యం కోసం పోరాడటం గత చరిత్ర. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం ప్రస్తుత చరిత్ర. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఎంపీలు అందరికీ అభినందనలు. ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం పనిచేయాలి. మూడున్నరేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటు వల్లే అన్ని సమస్యలు అధిగమించగలిగాం. బాధ్యత పెంచాం, సమర్ధత చూపాం. దీనిని ఇకపై కూడా మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా కొనసాగించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
 
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడమే: 
ప్రతిపక్షం లేఖల ద్వారా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పట్టుబట్టిన కేంద్రమంత్రి మీద ప్రతిపక్షం ఫిర్యాదులు శోచనీయం. తెలిసి చేసినా తెలియక చేసినా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం. ప్రతిపక్ష పోకడలు ప్రజాప్రయోజనాలను కాలరాసేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
 
116 రోజుల జలసంరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి: 
నేటి నుంచి 116 రోజులు జలసంరక్షణ పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రెండవదశ జలసంరక్షణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెరువుల్లో పూడిక తీత, ముళ్లకంపల తొలగింపు, గట్ల పటిష్టం తదితర పనులను ముమ్మరం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల చెరువులు, 2,500 సెలయేళ్లు, 10 వేల చెక్ డ్యామ్‌లలో చేపట్టిన జలసంరక్షణ పనులను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి వర్షపు చుక్కను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలవాగు పనుల్లో తాను స్వయంగా పాల్గొంటున్నానంటూ, ఆయా జిల్లాలలో జరిగే పనుల్లో కలెక్టర్లు,మంత్రులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. 
 
అతి త్వరలో లక్షన్నర గృహాల సామూహిక గృహ ప్రవేశం: 
అక్టోబర్ 2న లక్ష గృహాల సామూహిక గృహ ప్రవేశం విజయవంతం చేశాం. త్వరలోనే జరిగే లక్షన్నర గృహాల సామూహిక గృహ ప్రవేశం కూడా విజయవంతం చేయాలి అని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం రోజుకు 100 ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తున్నామని, దీనిని 150 ఇళ్లకు పెంచాలని ఆదేశించారు. ప్రతిరోజూ 150 ఇళ్ళ నిర్మాణం పూర్తికావాలన్నదే లక్ష్యంగా పేర్కొన్నారు. 2016-17 పనులు ప్రారంభం అయిన అన్ని ఇళ్లను వెంటనే పూర్తిచేయాలన్నారు. 2017-18, 2018-19 మంజూరైన ఇళ్ల నిర్మాణపనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అంగన్‌వాడి భవనాల నిర్మాణం ముమ్మరం చేయాలన్నారు.