శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:40 IST)

ఏపీ మాజీ సీఎం ఇంటిని కూల్చివేయనున్న అధికారులు.. కారణం అదే?

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకు వుంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ కూల్చివేతకు రంగం సిద్ధం అవుతుంది. చంద్రబాబు నివాసంతో పాటు శివస్వామి ఆశ్రమంలోని మరో రెండు ఇళ్లను కూడా కూల్చివేయనున్నారు. ఉండవల్లి కరకట్టపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అద్దెకు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు.
 
చంద్రబాబు ఇంటితో పాటు మరో రెండు ఇళ్లను కూడా అధికారులు కూల్చివేయనున్నారు. వారం రోజుల్లోగా కట్టడాలను ఖాళీ చేసి కూల్చి వేయాలని, లేకుంటే తామే ఆ పని చేస్తామని సీఆర్డీయే నుంచి గత వారం పలువురికి నోటీసులు అందిన సంగతి తెలిసిందే. కానీ ఆయా భవన యజమానులు ఇచ్చిన వాదనలు సంతృప్తికరంగా లేకపోవడంతో అధికారులు కూల్చివేత నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
Chandrababu Naidu, Undavalli, Amaravati, Demolition, Notice, చంద్రబాబు నాయుడు, ఉండవల్లి, నివాసం, కూల్చివేత