శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (13:12 IST)

శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శన వేళల్లో మార్పు

శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శన వేళల్లో మళ్లీ మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బుధవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ముక్కంటి దర్శనం, రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు భక్తులను అనుమతిస్తామని చెప్పారు.

స్వామి ఆర్జిత సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తామని గుర్తుచేశారు. ముక్కంటి దర్శన వేళల విషయమై అధికారులు రోజుకో నిర్ణయం తీసుకోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.