ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (10:53 IST)

కోయంబేడు మార్కెట్ ఎఫెక్టు : గ్రీన్ జోను సూళ్లూరుపేటలో 5 కేసులు

తమిళనాడు రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా చెన్నై కోయంబేడు మార్కెట్ నిలిచింది. ఫలితంగా తమిళనాడులో ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అంతేనా.. తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్ అని తేలింది. ముఖ్యంగా, చెన్నై మహానగరం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ జోనుగా ఉన్న సూళ్లూరు పేటలో కూడా ఐదు కరోనా పాజిటివ్ కేసులు రావడానికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్టేనని తేలింది. ఈ వైరస్ సోకినవారంతా కూరగాయల చిరు వ్యాపారులే కావడం గమనార్హం. 
 
లాక్‌డౌన్ వేళ సూళ్ళూరు పేటలోని సాయినగర్, వనంతోపు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో విక్రయించారు. ఫలితంగా ఈ రెండు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించారు. ఈ ప్రాంతాలకు వెళ్లే అన్ని దారులను మూసివేశారు.