గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:39 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంటిబిడ్డల విక్రయం... ఏ జిల్లాలో?

baby
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంటి బిడ్డల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారుగా భావించే పది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ చంటిబిడ్డల విక్రయంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి తమవంతు సహకారం అందిస్తున్నట్టు వార్తలు వస్తాయి. 
 
తాజాగా ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక తన బావచేతిలో మోసపోయి ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఏడో నెలలోనే మైనర్ బాలిక ప్రసవించండతో పుట్టిన బిడ్డను అంగన్ వాడీ సహాయకురాలి ద్వారా విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించింది. శిశువు వివరాలు సేకరించేందుకు వెళ్లిన శిశు సంరక్షణ అధికారులకు పాప కనిపించకపోవడంతో పోలీసుల సాయంతో ఎక్కడ ఉందనే వివరాలు సేకరించి శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. 
 
ఈఘటనపై ఏలూరు దిశా పోలీస్ స్టేషన్‌లో డీసీపీవో ఫిర్యాదు చేశారు. ఈ బిడ్డను అంగన్ వాడీ సహాయకురాలు నాగమణి ద్వారా రూ.2.70 లక్షలకు విక్రయించారు. ఈ కేసులో విజయవాడకు చెందిన టి.దుర్గ, గరికముక్కు విజయలక్ష్మి, మాడవత్తి శారద, చిలక దుర్గాభవానీ సహకారంతో గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన సయ్యద్ గౌసియాకు విక్రయిచినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.