శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (22:57 IST)

భార్యాభర్తలు గొంతుకోసుకున్నారు.. అంతా ఆ కలహాలే

కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గడ్డకిందపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శిరీష, వెంకటేష్‌ దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
 
ఆదివారం రాత్రి తమ ఇంటికి సమీపంలో ఉన్న మామిడితోట వద్దకు భార్యను తీసుకెళ్లిన వెంకటేష్‌.. ఆమె గొంతును కత్తితో కోసివేశాడు. ఆ తర్వాత తన గొంతు కూడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈనేపథ్యంలో.. ఉదయం వేళ అటువైపుగా వెళుతోన్న గ్రామస్థులు కొన ఊపిరితో ఉన్న వెంకటేష్‌ను ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే.. అప్పటికే శిరీష మృతి చెందడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.