పోలవరం మోటార్లకు విద్యుత్ సరఫరాకు జగన్ అంగీకారం
గన్నవరం నియోజకవర్గంలోని పోలవరం కాలువపై రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సోమవారం ఉదయం రవాణాశాఖ మంత్రి పేర్ని నానితో కలిసి తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి రైతుల సాగునీటి సమస్యను సీఎంకు వివరించినట్లు చెప్పారు.
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆదేసించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు తక్షణం పోలవరం మోటర్లకు విద్యుత్ సరఫరా చేయాలని మంత్రి సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రైతుల మోటర్లకు విద్యుత్ సరఫరా నిమిత్తం విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన ఒక్కో హెపి కి రూ.1400 చొప్పున మొత్తం సుమారు రూ.15లక్షలు అవుతుండగా ఈ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు యార్లగడ్డ వివరించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పర్మినెంట్ గా మోటార్లు ఏర్పటు చేసేందుకు సీఎం అంగీకారాన్ని తెలిపినట్లు యార్లగడ్డ వివరించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో సత్వరమే స్పందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ ను కలిసి సీఎం నిర్ణయాన్ని ఆయనకు వివరించి పర్మినెంట్ మోటర్ల ఏర్పాట్లపై చర్చించారు ఈమేరకు గన్నవరం నియోజకవర్గమ్ లోని పోలవరం కాలువ ప్రవహించే గ్రామాల్లోని రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు.