సైగ చేస్తే పనిచేసిపెడతారు... కానీ భేషజం చూపని సీఎం జగన్

cm medal
Last Updated: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:41 IST)
ఆయనో రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉంటారు. సైగ చేస్తే చాలు ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం భేషజం చూపలేదు. ఆయనెవరో కాదు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఈయన నడుచుకున్న తీరు పట్ల నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.

గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ సందర్భంగా ఓ పోలీస్‌ అధికారికి పతకాన్ని అలంకరించారు. సీఎంకు శాల్యూట్‌ చేసే సమయంలో ఆ పతకం పోలీస్‌ అధికారి నుంచి జారి పడింది. దీనిని గమనించకుండా ఆ అధికారి కవాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జారిపడిన ఆ పతకాన్ని సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ వైరల్‌ కావడంతో సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.దీనిపై మరింత చదవండి :