శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:33 IST)

కేసీఆర్‌ను వెనక్కి నెట్టిన జగన్ : దేశ్ కా మూడ్ సర్వే రిజల్ట్స్...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వెనక్కినెట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కేసీఆర్ అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ, జగన్ సీఎం అయిన తర్వాత కేసీఆర్ స్థానం దిగజారిపోయింది. 
 
జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన ఓ సర్వేలో 71 శాతం మంది జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీడీపీ అసోసియేట్స్ దేశ్ కా మూడ్ పేరిట ఈ సర్వే చేపట్టింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్ పట్ల అత్యధికులు హర్షం వ్యక్తం చేసినట్టు వీడీపీ సర్వేలో వెల్లడైంది. 
 
కాగా, ఈ మోస్ట్ పాప్యులర్ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలోనూ, మూడో స్థానంలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే, నాలుగో స్థానంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఐదో స్థానంలో కె. చంద్రశేఖర్ రావులు ఉన్నారు. 
 
ఆ తర్వాతి స్థానాల్లో అమరీందర్ సింగ్ (పంజాబ్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), విజయ్ రూపాని (గుజరాత్), రఘుబర్ దాస్ (జార్ఖండ్), కమల్నాథ్ (మధ్యప్రదేశ్), మమతా బెనర్జీ (వెస్ట్ బెంగాల్), నితీష్ కుమార్ (బీహార్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), ఎడప్పాడి కె.పళనిస్వామి (తమిళనాడు)లు ఉన్నారు.