బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (14:44 IST)

పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఈ నెల 21 సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన మంగళవారం వుంటుంది. మంగళవారం ఉదయం 10:15 నిమిషాలకు ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటలకు తణుకు చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాటి.. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై 1:50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారని సీఎంఓ కార్యాలయ వర్గాలు పేర్కొన్నారు.
 
అయితే.. ఈ పథకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరిగింది. పేదలు ఎవరూ ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించొద్దని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగానే ఇంటి పట్టాలు అందజేస్తామంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.