ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (13:48 IST)

ఏపీలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజులో 43 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. కరోనా బారిన పడిన బాధితులు నిన్న ఒక్కరోజే 43 మంది మృతి చెందారు.

కరోనా కేసులు కూడా అత్యధికంగా 1,916 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా వైరస్‌ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 33,019కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 408కు చేరింది. 
 
గుంటూరు జిల్లా తెనాలిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 97 కేసుల నమోదవ్వడంతో తెనాలివాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసులు ట్రిపుల్ సెంచరీ దాటాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య  304కు చేరుకుంది.