ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జులై 2020 (09:36 IST)

15న ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మారబోతోంది. ఇప్పుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి.

ఈ నెల 15  జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం ప్రకటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది కేవలం లాంఛనమే. అధికారంలోకి రాగానే జిల్లాల విభజన జరుగుతుందని జగన్ 
 
గతంలో చెప్పారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లా  చేస్తామని చెప్పారు. అంటే ఈ లెక్కన 25 జిల్లాలు అవుతాయి.

ప్రస్తుత జిల్లాల్లో ఒక్కోటి రెండుగానో మూడుగానో విభజితమవుతుంది. జిల్లాల విభజనపై  వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేల మనస్సుల్లో ఏముందో తెలియదుగాని ఇప్పటివరకైతే ఎవరూ వ్యతిరేకించలేదు. 
 
కానీ వారిలో ఈ విభజన పట్ల తీవ్ర అసంతృప్తి వున్నట్లు పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాల విభజన జగన్ కు మరిన్ని తల నొప్పులు తెచ్చి పెడుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.