శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జులై 2020 (10:10 IST)

మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు కరోనా

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు కరోనా నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ నిర్ధారణ అయింది.

దీంతో ఆయన హోమ్ *ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. బోడే ప్రసాద్‌ దాదాపు 15 రోజుల నుంచి గ్రామాల్లో పర్యటిస్తుండడం, అలాగే కార్యాలయానికి కూడా ఎక్కువమంది ప్రజలు రావడం.. వాళ్లందరితో మమేకం అవుతున్న నేపథ్యంలో కరోనా సోకినట్లు భావిస్తున్నారు. 
 
ఆయన కుటుంబసభ్యుల్లో కూడా ఒకరికి పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం.