శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జులై 2020 (22:38 IST)

24 గంటలలో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు: కృష్ణా జిల్లా కలెక్టర్

శాంపిల్స్ సేకరించిన 24 గంటలలోగ కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎం‌డి.ఇంతియాజ్ తెలియచేసారు.

కలెక్టర్ కాంప్ కార్యాలయములో కరోన టెస్ట్ ల  అమలు తీరును వైద్యాధికారులతో బుధవారము కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికి అందుబాటులో ఉన్న4 మిషనులకు ఆధనంగా 3 బయో రాడ్ ఆధునాతనమైన మిషనులను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అదే రోజునఅంటే శాంపిల్ సేకరించిన 24 గంటలలోగా కరోన నిర్ధారణ ఫలితాలు వెల్లడవుతాయి. 

నిర్ధారణ ఫలితాలు సంబంధిత వ్యక్తుల ఫోన్ నెంబర్ లకు ఫలితాలు వెల్లడవుతాయని, ఒకవేళ ఫలితాలు రాని పక్షంలో సంబంధిత  గ్రామ/వర్డ్ వాలెన్టైర్ వద్దన ఆధర్ నెంబర్ ఇచ్చి సమాచారము పొందవచ్చునని కలెక్టర్ తెలియచేసారు.

గ్రామ వాలంటీర్/ వార్డ్ వాలంటీర్ లకు సమాచారము ఈ క్రింద విధముగా వారి మొబైల్ యాప్ లో లభ్యమౌతుంది. ఏ వ్యక్తులకైతే కరోన లక్షణాలు కనబడతాయో వారు వెంటనే టెస్టింగ్ సెంటర్లలొ టెస్టు చేయించుకోగలరు. త్వరితగతిన ఫలితాలతో మచీ చికిత్స పొంది కరోన వ్యాధి నుంచి బయట పడగలరు అని తెలియచేసారు.