అరగంటలోనే కరోనా పరీక్షల రిజల్ట్
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా హాట్స్పాట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని, ఇలా చేస్తే 15-30 నిమిషాల్లోనే కరోనా ఉందో లేదో తెలుస్తుందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది.
వైరస్ నిర్ధారణకు యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. కొవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న 42 హాట్స్పాట్ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.
ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో భాగంగా హాట్స్పాట్ ప్రాంతాల్లో యాంటీబాడీ రక్త పరీక్షలతో కరోనా వైరస్ను నిర్ధారించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్.