మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (22:04 IST)

మంత్రి కొడాలి నానికి కరోనా నిర్ధారణ పరీక్షలు

మంగళవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) సోమవారం రాత్రి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని మంత్రి కొడాలి నాని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధంగా ప్రభుత్వ వైద్యులు ఆయా పరీక్షలను పూర్తి చేశారు.