శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:40 IST)

క్యాన్సర్ కన్నా కరప్షన్ డేంజర్: గవర్నర్

కరెప్షన్‌  క్యాన్సర్‌ కన్నా ప్రమాదకరమైందని గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  నిర్వహించిన విజిలెన్స్‌ వారోత్సవాలను గవర్నర్‌   ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిరహిత దేశంగా భారతదేశం ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. దేశంలో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.