శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (13:39 IST)

అమరావతి నిర్మాణంలో బాబు ప్లాన్ బాగుంది.. కల్లు తాగుతూ.. నారాయణ

అమరావతిలో సీపీఐ జాతీయ నేత నారాయణ సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. గురువారం ఉదయం పూట సైకిల్‌పై సచివాలయం చూసేందుకు వచ్చిన నారాయణను చూసి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సచివాలయం లోపలకు పంపాలని నారాయణ కోరారు. అయితే

అమరావతిలో సీపీఐ జాతీయ నేత నారాయణ సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. గురువారం ఉదయం పూట సైకిల్‌పై సచివాలయం చూసేందుకు వచ్చిన నారాయణను చూసి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సచివాలయం లోపలకు పంపాలని నారాయణ కోరారు. అయితే ఆ సమయంలో ఎవ్వరూ లేరని సిబ్బంది చెప్పడంతో.. సచివాలయంలో లాన్‌లోనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత క్యాంటీన్‌ను సందర్శించి.. రోడ్డు పక్కనే వున్న తాటి కల్లు రుచి చూశారు. 
 
ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు గుప్పించారు. అమరావతి నిర్మాణంలో సీఎం ప్లాన్ బాగుందంటూ కితాబిచ్చారు. దీర్ఘకాలిక ఆలోచనలతో రోడ్లను వేస్తున్నారని చెప్పారు. బాబు ఆలోచనలు పూర్తి స్థాయిలో ఆచరణకు సాధ్యం కాకపోవచ్చునని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీపైకి నవ్వులు చిందిస్తూ, నిధుల విషయంలో మొండిచేయి చూపిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా కేంద్రానిదేనని నారాయణ ఫైర్ అయ్యారు. కేసులకు భయపడి, బతిమాలితే నిధులు రావన్నారు. జైలుకెళ్తే ఆ తర్వాత హీరోలవుతారని ఎద్దేవా చేశారు.