బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (16:38 IST)

నారా లోకేష్ పైన క్రిమినల్ కేసు నమోదు....

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనపై అనవసరంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా రాజకీయ దురుద్ధేశంతో, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రా రెడ్డి గారికి అంటగట్టినందుకు నారా లోకేష్ పైన కేసు నమోదైంది.

ఎమ్మెల్యేను నిందిస్తూ, వార్నింగులు ఇస్తూ, ట్విట్టర్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి కాపు రామచంద్రారెడ్డి గారి గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనపై ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగిస్తూ కాపు రామచంద్రా రెడ్డి గారికి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు ఫిర్యాదు అందడంతో నారా లోకేష్ గారి పై డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 and 506 గా కేసు నమోదు చేసినట్లు తెలియవచ్చింది.