శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (18:24 IST)

రోజులో ఒక గంట ప్రతి రోజు పోలీస్ స్పందన

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే సదుద్దేశంతో తలపెట్టిన ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రారంభించారు. ఫిర్యాదుదారుల‌ నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రతి రోజూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు తమ చేయి అందించి నడిపించుకొని తీసుకువచ్చారు. పోలీస్ కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, వారితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడుతున్నారు. వారి సమస్య పూర్వాపరాలను తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులను సత్వరంగా పరిష్కరించవలసిందిగా తగు ఆదేశాలను జారీ చేసారు.

ప్రతి రోజు మ‌ధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు, ఒక గంట పాటు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిస్తారు. వాటి తీవ్రత ఆధారంగా వెంటనే విచారణ జరిపించి పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టామని ఎస్పీ తెలియజేశారు.