బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:20 IST)

తుగ్లక్ పాలనలో ధర్నాచౌక్ ఫుల్.. లోకేష్

ఈ మధ్య కాలంలో ట్విట్టర్లో రెచ్చిపోతున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

"తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్. అమరావతిని ఎడారి చేసారు, పొలవరాన్ని మంగళవారంగా మార్చారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు.

ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు. ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారు.

ఈ మాత్రం దానికి వంద రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే?" జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  మండిపడ్డారు.