గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 24 జూన్ 2021 (22:20 IST)

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి.

రాయచోటి నియోజక వర్గంలోని అభివృద్ధి పనులలో వేగం పెంచాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులును ఆదేశించారు శ్రీకాంత్ రెడ్డి. గురువారం తన కార్యాలయంలో జెడ్పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డిలతో కలసి పంచాయతీ రాజ్ ఈ ఈ రామచంద్రా రెడ్డి, పి ఐ యు ఈ ఈ శ్యామ్ సుందర్ రాజు, డి ఈ గోపాల్ రెడ్డి లతో నియోజక వర్గ పరిధిలో జరుగుచున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ఆయన మండలాల వారీగా ఆరా తీశారు.

రహదారుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవన  నిర్మాణాలపై ఆయన గ్రామాల వారీగా ఆరా తీశారు. జులై 8 న అధిక సంఖ్యలో గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల భవనాలు ప్రారంభాలకు నోచుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతగా ,త్వరితగతిన చేపట్టాలని అధికారులుకు  శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో మండల ఇంజనీరింగ్ అధికారులు, సర్పంచ్ ముసల్ రెడ్డి,వైఎస్ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.