1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (11:06 IST)

సిగ్గులేకుండా చంద్రబాబుని తిడతారా?: దేవినేని ఉమామహేశ్వరరావు

పోలవరం జాతీయప్రాజెక్ట్, రాష్ట్రానికి ప్రాణనాడి,  జీవనాడి అని, 50లక్షల ఎకరాలను సస్యశ్యామలంచేసే ప్రాజెక్ట్ అని,  కానీ దానినిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, తాడేపల్లి రాజప్రాసాదంలోఉన్న చేతగాని, దద్మమ్మ ముఖ్య మంత్రి, ప్రాజెక్ట్ పనులను నత్తనడకన నడిపిస్తున్నాడని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే  మీకోసం... !
 
 
2014కు ముందు పోలవరంప్రాంతంలోని ఏడుగ్రామాల  నిర్వాసితులు తమకు పరిహారం అందలేదని ధర్నాలుచేశా రు. డ్యామ్ సైట్ కు ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు వెళ్లాలంటే భారీ పోలీస్ బందోబస్తుమధ్యన వెళ్లాల్సి ఉండేది. అలాంటి పరిస్థితులను అర్థంచేసుకున్న చంద్రబాబునాయుడు, 2014లో అధికారంలోకి రాగానే మరోసారి నిర్వాసితులకు రూ.110కోట్ల పరిహారం అందించడంజరిగింది.  3,922 నిర్వా  సితకుటుంబాలను ఖాళీచేయించడం జరిగింది.

తరువాత కాంక్రీటు పనులు, స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు ప్రారంభ మయ్యాయి. 2014కు ముందున్న పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్ట్ పరిధిలో కేవలం రూ.5,135కోట్ల పనులుమాత్రమే జరిగాయి. చంద్రబాబునాయుడి ఐదేళ్లపాలనలో రూ.11,574 కోట్లను ప్రాజెక్ట్ నిర్మాణానికి వెచ్చించడం జరి గింది. కేంద్రాన్ని ఒప్పించి, నాబార్డ్ రుణాలు తెచ్చి, ప్రాజెక్ట్ పనులను పరుగులుపెట్టించాము.

ప్రతిపక్షంలో ఉన్న జగ న్మోహన్ రెడ్డి ఆనాడు ప్రాజెక్ట్ పునాదులుకూడా లేవలేదని కారుకూతలు కూశాడు. చేయాల్సిన దుష్ప్రచారమంతా చేశాడు. అబద్ధాలుచెప్పి, ప్రజలను మోసగించి అధికారం లోకి వచ్చాడు.  2019 జూన్ లో, అధికారులతో సమీక్ష జరిపేటప్పుడు వారు చాలాస్పష్టంగా చెప్పారు. నవంబర్ లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులుప్రారంభించాలన్నారు. అలాచేస్తే 20 డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు.

అప్పుడే 2021 జూన్ నాటికి నీరివ్వడంసాధ్యమవుతుందని కూడా చెప్పారు. అధికారులుచెప్పిందానికి,  ఆనాడు జగన్మోహన్ రెడ్డి తలూపి, విషపునవ్వు నవ్వాడు.  చంద్రబా బునాయుడి హాయాంలో 71.12శాతం పనులుజరిగితే, వాటిని నేను ముందుకుతీసుకెళ్లాలా అని ఈ ముఖ్యమంత్రి వాటిని రద్దుచేశాడు. 2018లో బెస్ట్ ఇంప్లింమెంటేషన్ ప్రాజెక్ట్  అవార్డ్ పోలవరానికి దక్కింది.  ఆనాడు కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డ్ తీసుకోవడం జరిగింది.

అలాంటి ప్రాజెక్ట్  పనులను రద్దుచేసిన ఈముఖ్యమంత్రి, డయాఫ్రమ్ వాల్ పనులు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ పనులను గాలికొదిలేశాడు.  స్పిల్ వే లో అప్పటికే కాంక్రీట్ పనులన్నీ శరవేగంగా పూర్త య్యాయి. దాన్ని పైకి తీసుకెళ్లి గేట్లు అమర్చేసి, ప్రాజెక్ట్ మొత్తం తానేకట్టినట్టు చెప్పుకోవాలని అత్యాశకు పోయాడు. అందుకే ఈ ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడాడు.  రివర్స్ డ్రామాలతో బంగారంలాంటి ఒక సీజన్ మొత్తం ఊరికే పోయింది. 

రివర్స్ టెండరింగ్ తో రూ.700కోట్లు ఆదాచేశాన నిచెప్పి, రూ.900కోట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ని కూడా రద్దుచేశా డు. ఒకే కాంట్రాక్టర్ ని పెట్టి, రివర్స్ టెండరింగ్ డ్రామాలతో – 26శాతంతో రూ.1500కోట్ల పనులు అప్పగించాడు. అవి అప్పగించాక కాంట్రాక్ట్ సంస్థ ఎంతపనులుచేసింది?  పోలవరం నిర్మాణం జూన్ 2021 కిపూర్తిచేస్తామని, బుల్లెట్ దింపుతామని అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడు బుల్లెట్ దిగిందాలేదా...అసమర్థుడా..చేతగాని దద్దమ్మా. అహంకారం తో పోలవరం పనులను గాలికొదిలేశారు.

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబునాయుడిని తిడతారా? ఈ ముఖ్యమంత్రి కరోనా సమయంలో బయటకువచ్చాడా?   18వేల నిర్వాసితకుటుంబాలను 2020మేనాటికి ఉద్ధరిస్తా మని బడాయికబుర్లుచెప్పారు. నిర్వాసితులకు రూ.10లక్ష లిస్తానని డబ్బాలుకొట్టాడు. వరదలసమయంలోఇస్తానన్న రూ.5వేలే అందలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి పోలవరం నిర్వాసిత మండలాలకువెళితే, అక్కడున్నవారే ఆయనకు సమాధానంచెబుతారు.

నిర్వాసితులముందుకెళ్లే దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నాయా? చంద్రబాబునాయుడి హాయాంలో ఖర్చుపెట్టిన రూ.4వేలకోట్లను కేంద్రం తిరిగిచ్చిం ది. ఆసొమ్మంతా దేనికిఖర్చుపెట్టారో చెప్పండి.  పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఎంతపనులుచేశారోచెప్పండి? పోలవరం పరిశీలనకు వచ్చిన కేంద్రఅధికారులు ఈ ప్రభు త్వానికి గడ్డిపెట్టివెళ్లారు. వరదలు వచ్చే సమయానికి ఎన్ని పనులుచేశారో చెప్పండి? డయాఫ్రమ్ వాల్ పనులు సంగ తేంటి? 2020 పోయింది.. 2021 జూన్ కూడా వచ్చింది.   

పోలవరం ప్రాజెక్ట్ ని హంద్రీనీవా కాలువలపై పనిచేసిన ఇంజనీర్లు కడుతున్నారు. సిగ్గుపడాలి మీరు. కేంద్రనిపుణు ల సూచనలకు అనుగుణంగా పనులుచేయకుండా,ఇష్టమొ చ్చినట్టుచేస్తారా? టీడీపీహాయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టా రని గగ్గోలుపెట్టారుకదా... ఇప్పుడేం చేస్తున్నారు. సిగ్గులేకుండా, ప్రజలప్రాణాలుపోతున్నాకూడా లెక్కచేయ కుండా కరోనా నిధులనుకూడా కాంట్రాక్టర్లకు చెల్లించారు.  రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడి, కావాల్సినవారికి టెండర్లు కట్టబెట్టారు. 

పనులుగురించి అడుగుతుంటే నోరెళ్లబెడుతున్నారు.  పనులు పూర్తిచేయడం చేతగాక, సిగ్గులేకుండా చంద్రబాబుని తిడతారా?  2018-19లో ఇరిగేషన్ రంగానికి చంద్రబాబునాయుడు రూ.1,4500 కోట్లుఖర్చుపెట్టారు.   ఈ రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్ధరించాడు?  ఎన్నిప్రాజెక్టులు పూర్తిచేశాడు? తమ ప్రభుత్వంలో 14ప్రాజెక్టులు పూర్తిచేశామని బడ్జెట్లో బుగ్గన తప్పుడు సమాచారమిచ్చి, చాలాపెద్ద తప్పుచేశాడు. వాటిపేర్లు చెప్పగలధైర్యం బుగ్గనకు, ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి  ఉందా?  ఎక్కడైనా బొచ్చె మట్టితీశారా.. ఒక్క మీటర్ కాంక్రీట్ పనిచేశారా? 

హంద్రీనీవా, గాలేరు-నగరి, పోలవరం లెఫ్ట్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి, తెలుగుగంగ పనులు ఎంత జరిగాయి? ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం కాదు.  ప్రాజెక్ట్ వివరాలకు సంబంధించిన లక్ష డాక్యుమెంట్లను ఢిల్లీకితీసుకెళ్లి, కేంద్రాన్ని ఒప్పించి, రూ.55,548 కోట్లకు ప్రాజెక్ట్ వ్యయానికి ఆమోదముద్రవేయించాం.

ఈ ముఖ్యమంత్రి చేతగాని తనంతో ప్రాజెక్ట్ నిర్మాణవ్యయం  సగానికిసగం కుదించారు.  టీడీపీ నేతలపై కేసులు పెడితే, ప్రాజెక్టులు పూర్తి కావు.  50 ఏళ్ల యువకుడినని చెప్పుకోవడం కాదు.. ఒక్కరోజైనా బయటకువచ్చాడా?  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30సార్లు పోలవరంప్రాజెక్ట్ ని సందర్శించాడు.  వారంవారం ప్రాజెక్ట్ నిర్మాణంపై సమీక్ష చేసి, ఎప్పటికప్పుడు మీడియాకు చెప్పేవాళ్లం. 

ఈ దద్దమ్మ ప్రభుత్వం ఒక్కరోజైనా మీడియాతో కలిసి ప్రాజెక్ట్ ను సందర్శించిందా? 2021  జూన్  నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు. ఇప్పుడేంసమాధానం చెబుతారు?  నేలముక్కుకి రాసి ప్రజలకు క్షమాపణచెబుతారా?  కరోనా ఉందని పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేశామని చెప్పుకుంటారా?  5కోట్ల మందికి అబద్ధాలు, అసత్యాలుచెప్పినందుకు ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలి. ప్రజలముందుకొచ్చి తప్పుఒప్పుకొని చెంపలేసుకోవాలి. 

పోలవరం నిర్మాణంలో టీడీపీహాయాంలో రూ.25వేలకోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు మీడియాలో విషప్రచారంచేశారు. దానికేం సమాధానం చెబుతారు? జాతీయప్రాజెక్ట్ ప్రాంతంలో నీ అయ్య, నాఅయ్య విగ్రహలు పెడతావా? 
పక్కరాష్ట్రంతో బేరసారాలాడి ప్రాజెక్ట్ ని 135 అడుగులకు పరిమితంచేస్తావా?నీ అసమర్థత, అత్యాశతో బంగారం లాంటి పోలవరం జాతీయప్రాజెక్ట్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మార్చావు. పోలవరం డ్యామ్ దగ్గర ఇంకో లిఫ్ట్ పెట్టడానికి జీవో ఇచ్చినప్పుడే నీ పనితనం అర్థమైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాబట్టే , అలాంటి జీవోలిస్తోంది. 
 
 చంద్రబాబు నిర్మించిన పట్టిసీమను ఒట్టిసీమన్నావు. అది దండగని, దాని పంపులు పీకుతామని అన్నారు. కానీ ఆ పట్టిసీమే ఇప్పుడు ఈప్రభుత్వానికి దిక్కయ్యింది. ప్రకాశం బ్యారేజీని 125సార్లు నింపితే ఎన్నినీళ్లువస్తాయో, అన్నినీళ్లు పట్టిసీమద్వారా వస్తున్నాయి. 370 టీఎంసీల నీటిని సముద్రం పాలుకాకుండా, పట్టిసీమద్వారా చంద్రబాబునాయుడు కృష్ణాడెల్టాలో 44వేలకోట్ల పంటఉత్పత్తులుపండేలా చేశాడు.

ఆరేళ్లనుంచి అదేవిధంగా కృష్ణాడెల్టాకు పట్టిసీమే దిక్కయ్యింది. ఆనీటినే అనంతపురం జిల్లాకుతరలించాము. వాటివల్లే కియాకార్ల పరిశ్రమ వచ్చింది.  ఈదిక్కుమాలిన ప్రభుత్వం కనీసం సైకిళ్లు తయారుచేసే కంపేనీకూడా తీసుకురాలేకపోయింది. జాతీయప్రాజెక్ట్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మార్చింది చాలక, పనులు ఎందుకు జరగలేదంటే, కోవిడ్ ను కారణంగా చెబుతారా? ఎక్కడ, ఏ ప్రాజెక్ట్  లోనైనా సరే పనులుజరుగుతున్నాయా? నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం అందించారు..ఎన్నిఇళ్లు నిర్మించారో చెప్పండి.

టీడీపీ ప్రభుత్వం పోలవరానికి ఖర్చుచేసిన సొమ్ములో కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లుకొట్టేయడం తప్ప, ఏం సాధించారు?  రాజశేఖర్ రెడ్డి హాయాంలో గానీ, తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలహాయాంలో గానీ పోలవరంలో ఎంతశాతం పనులు జరిగాయో, చంద్రబాబునాయుడి హాయాంలోఎంతజరిగాయో చెప్పండి. దమ్ము,ధైర్యముంటే ప్రజలకు వాస్తవాలు చెప్పండి.

పోలవరం సైట్ లో ముఖ్యమంత్రి అయ్య విగ్రహంపెట్టాలా..లేక ప్రాజెక్ట్ కి శంఖుస్థాపన చేసిన అంజయ్య విగ్రహంపెట్టాలా?  72శాతం వరకు పనులుపూర్తిచేసిన చంద్రబాబునాయుడి విగ్రహం పెట్టాలా? విగ్రహాలు పెట్టడంకాదు.. ప్రాజెక్ట్ ని అనుకున్నప్రకారం ఎత్తుతగ్గించకుండా పూర్తిచేయండి.  తప్పుడుకేసులతో నోళ్లుమూయించలేరు. రూ.లక్షకోట్ల దోపిడీలో, రూ.43వేలకోట్ల అవినీతి సొమ్ముజప్తు చేయించుకున్న వ్యక్తి, నేడు తమపై తప్పుడుకేసులు పెడుతున్నాడు.

సీబీఐ వారు జగన్మోహన్ రెడ్డిని విచారిస్తున్నప్పుడు అతనికుటుంబం మొత్తం రోడ్లెక్కి, ప్రభుత్వాన్ని, పాలకులను బూతులు తిట్టారు. మూడురోజులు 27 గంటలపాటు సీఐడీ వారు విచారించినా నావాళ్లు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. తప్పుడుకేసులు పెట్టినా, జైళ్లకు పంపినా టీడీపీకార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడరు.

ఈ ముఖ్యమంత్రి చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాము. చేతగాని, చేవలేని, చవట మంత్రులతో బూతులు తిట్టించడం మానేసి, జగన్ రెడ్డి ప్రజల ముందుకొచ్చి తనముక్కు నేలకురాసి తక్షణమే బహిరంగ క్షమాపణచెప్పాలి