శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:09 IST)

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బాధాకరం : తెరాస మహిళా ఎమ్మెల్యే

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని పలువురు స్వాగతిస్తుంటే, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ఆలేరులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బాధాకరమన్నారు. 'దిశ అనే అమ్మాయికి అన్యాయం జరిగింది. మాకూ బాధ కలిగింది. కేసులో నిందితులైన ఆ నలుగురు పిల్లలను చంపేశారు. అందుకు కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించాలి' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.