ఉసిరి కాయను రాత్రిపూట తింటే..?
ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం వుంది. ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది. అందుకే సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది. ఈ కారణంగానే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు. అంతేగాకుండా రాత్రి సమయంలో ఉసిరిని తీసుకోకూడదు. ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది.
ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాం.
అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు. కానీ సోమవారం, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఏకాదశి రోజున ఉసిరికాయతో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుంటారని ఆయుర్వేద, ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.