రైతు కూలీలు దొరక్క... డ్రోన్ లతో ఎంచక్కా...
గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి కూలీలు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. సమయానికి నాట్లు వేయడానికి, పురుగు మందులు పిచికారీ చేయడానికి కూలీలు లేక, కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు.
గుంటూరు జిల్లా ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో ఇద్దరు రైతు సోదరులు తమ పొలాలకు రైతులు కూలీలు దొరక్క...చివరికి తెగించి, టెక్నాలజీని ఆవ్రయించారు. ఏకంగా ఒక డ్రోన్ ను ఇద్దరూ కలిసి కొనేసుకున్నారు. కొత్త డ్రోన్ టెక్నాలజీతో వరి పొలాలకు కూలీల అవసరం లేకుండా సొంతంగా స్ప్రేయింగ్ చేస్తున్నారు. కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో అగ్ని గుండాల గ్రామస్తులు ఇద్దరు కలిసి 6,00,000/- రూపాయలతో అగ్రికల్చర్ స్పెయింగ్ డ్రోన్ అనే యంత్రం కొన్నారు. దీనితో ఒక ఏకరాన్ని కేవలం 10 నిమిషాల్లో స్పేయింగ్ చేయవచ్చు.
ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అగ్ని గుండాల గ్రామానికి చెందిన ఆ ఇద్దరు యువకులు తెలియజేశారు. తమ పొలానికి స్ప్రేయింగ్ పూర్తి చేయడమే కాకుండా, పక్క పొలాల వారికీ కూడా దీనితో సేవలు అందించాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీని వల్ల తమకు పొలం పని కావడమే కాకుండా, పక్క వాళ్ళకు కూడా సహాయం అందుతుందని భావిస్తున్నారు.