దుబ్బాక ఉపఎన్నిక విజేత రఘునందన్ రావు, తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పణ

raghunandan rao
వి| Last Modified బుధవారం, 11 నవంబరు 2020 (17:00 IST)
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను ఓడించి దాదాపు 1400 ఓట్ల మెజారిటితో విజేతగా నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునంధన్ రావు ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

అనూహ్య రీతిలో రఘునంధన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని రెండో స్థానానికి పరిమితం కాగా, మూడో స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడటానికి ఈ విజయం తమలో నిండు ఉత్సాహాన్ని నింపిందని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :