బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (16:32 IST)

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

Bhalla Suri warns Kakinada city MLA Kondababu
కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తన అనుచరుడి అక్రమ కట్టడాలను మునిసిపల్ అధికారులు కూల్చివేతకు దిగడంతో అక్కడికి ద్వారంపూడి తన అనుచరగణంతో వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కూల్చివేతను ఆపివేసేందుకు ద్వారంపూడి నిర్మాణంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసారు. ఐతే పోలీసులు ఆయన్ని నిరోధించారు.
 
ఈ క్రమంలో ద్వారంపూడి ప్రధాన అనుచరుడు భళ్లా సూరిబాబు ఏకంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును దుర్భాషలాడుతూ నీ అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. మరోవైపు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో వున్న ప్రభుత్వ భూమిని ద్వారంపూడి ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతుండటంతో ద్వారంపూడిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశించారు.