గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (07:52 IST)

మిజోరంలో భూకంపం : చంపైకి 56 కిమీ దూరంలో...

ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో శుక్రవారం వేకువజామున భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలు భూకంప లేఖినిపై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని చంపైకు 56 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు జాతీయ సిస్మోలజీ కేంద్రం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.43 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చిందని తెలిపింది. 
 
కాగా, ఈ నెల 11వ తేదీన కూడా ఇదే రాష్ట్రంలో భూకంపం వచ్చింది. గత శనివారం ఐజ్వాల్‌లో కనిపించిన ఈ భూకంప ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. వీటి కేంద్రాన్ని ఐజ్వాల్‌కు 31 కిలోమీట్ల దూరంలో గుర్తించారు. అదేవిధంగా గత నెల 29వ తేదీన కూడా 4.2 తీవ్రతతో చంపైలో భూప్రకంపనలు కనిపించాయి.