ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:18 IST)

శ్రీవారి భక్తులు.. తిరుపతిలో గదులు పొందడం సులువు.. ఎలా?

తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లోని గదులను డిసెంబర్ 15వ తేదీ నుంచి భక్తులకు కేటాయిస్తారు. ఈ సముదాయాల్లోని గదులు ఆన్‌లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 
 
ఇందు కోసం డిసెంబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో గదులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.తిరుపతి బాలాజీ.ఎపి,  జిఓవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా భక్తులు గదులను బుక్ చేసుకోవచ్చునని టిటిడి తెలిపింది. 
 
కోవిడ్-19 నేపథ్యంలో శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను కొంతకాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు. కేసులు తగ్గడంతో క్వారంటైన్ కేంద్రాలను ఎత్తేశారు. గదులను దశలవారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భక్తులకు కేటాయించేందుకు సిద్ధం చేసింది టిటిడి.