శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (08:13 IST)

నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి

నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో నగదు, లిక్కర్​ను పూర్తిగా నిరోధించాలన్నారు. నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చామన్నారు.

నగదు, లిక్కర్​లను పూర్తిగా నిరోధించాలన్న ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ఒకవేళ ఎన్నికల తర్వాత కూడా నిర్ధరణ అయితే మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని తెలిపారు. దీనికోసం పోలీసులు, అధికారులు కృషి చేయాలన్నారు.

సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్​ను ఉపయోగించినట్లే ఈ ఎన్నికలకూ ఒక యాప్ అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా వీటికి విరుద్ధంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.