సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (14:52 IST)

మే నెలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు మే నెలకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. మొత్తం 72,773 టిక్కెట్లను ఉంచింది. వీటిలో ఆన్‌లైన్ డిప్ విధానంలో 11498 టిక్కెట్లు, సుప్రభాత సేవకు 8143 టిక్కెట్లు, తోమాల సేవకు 120, అర్చనకు 120, అష్టదళపద్మారాధన సేవకు 240, నిజపాద దర్శనంకు 2875 చొప్పున ఉంచింది.
 
అలాగే, ఆన్‌లైన్ జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 61,275 ఆర్జితసేవా టికెట్లను కూడా ఉంచింది. వీటి వివరాలను పరిశీలిస్తే, 
విశేషపూజ - 2000, కల్యాణోత్సవం - 14,725, ఊంజల్‌ సేవ - 4,650, ఆర్జిత బ్రహ్మూత్సవం-7,700, వసంతోత్సవం-15,400, సహస్రదీపాలంకార సేవ  - 16,800 చొప్పున ఉంచింది.