బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (11:10 IST)

ఏపీలో ఎస్ఎంఎస్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి నెల విద్యుత్ వినియోగాన్ని ఏప్రిల్‌కు వర్తింపజేయాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ పలు నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు పంపనుంది.

ఈ నెల 18 వరకు అపరాధ రుసుం లేకుండా బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఈ మార్పును 8 జిల్లాల ప్రజలు గమనించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు కోరారు.
 
ఆన్‌లైన్‌ ద్వారా ఆరోగ్య సేవలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రజా ఆరోగ్య వేదిక ముందుకొచ్చింది. కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు, రోగులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది.

24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు ఉచిత హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040 48214595కు ఫోన్‌ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చునని ప్రజా ఆరోగ్య వేదిక ఒక ప్రకటనలో తెలిపింది.