శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 17 డిశెంబరు 2018 (21:10 IST)

తిరుమలలో టిటిడి అధికారులను పరుగులు పెట్టించిన గవర్నర్(Video)

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. భక్తుల కోసం టిటిడి ఏర్పాటు చేసిన క్యూలైన్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు త్వరితగతిన వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించాలని టిటిడి  అధికారులను ఆదేశించారు గవర్నర్.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా టీ.టీ.డీ. వారు చక్కటి ఏర్పాట్లను చేసారని గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
 
సోమవారం ఉదయం తిరుమలలో గవర్నర్ తనిఖీలు నిర్వహించారు. తొలుత గవర్నర్ భక్తాదులు వెళ్ళే రూ. 300 క్యూలైన్, 4 నుండి 7 వరకు అలాగే 8 నుండి 14 వరకు గల కంపార్ట్మెంట్లు, సుపథం, ప్రత్యేక దర్శన క్యూలైన్లను పరిశీలించారు. అలాగే కాలినడక భక్తులు వెళ్లే దివ్యదర్శన క్యూలైన్‌ను పరిశీలీంచారు. అనంతరం గవర్నర్ నారాయణగిరి ఉద్యాన వనం సెక్టార్ 1 వద్ద క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడి, టీ.టీ.డీ. వారు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఇస్తున్న ఉప్మా పలహార ప్రసాదాన్ని సేవించి రుచి చూసారు.
 
ఏ.టీ.జీ.హెచ్. వద్ద గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పండుగ రోజుల్లో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా టీ.టీ.డీ. వారు చక్కటి ఏర్పాట్లను చేసారని అభినందించారు. వీడియో చూడండి.