గురువారం, 2 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (18:45 IST)

అప్పుడో కథ చెప్పి తప్పించుకున్నావ్.. పదేళ్ల తర్వాత మళ్లీ?

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌కి ధీటుగా బదులిచ్చాడు.. టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ తనతో వివాదానికి కాలు దువ్వుతున్న సైమండ్స్‌కు భజ్జీ ధీటుగా బదులిచ్చాడు. ఇంతకీ ఏమైందంటే..? 2008 మంకీగేట్ వివాదంలో భజ్జీ తనకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చినప్పుడు కన్నీటి పర్యంతమయ్యాడని.. గతాన్ని తవ్విన సైమండ్స్‌కి భజ్జీ ఇలా సమాధానమిచ్చాడు. 
 
మామూలుగానే తనదైన స్టైల్‌లో స్పందించాడు. అప్పట్లో  2008లో ఓ కథ చెప్పి తప్పించుకున్నావని.. ప్రస్తుతం 2018లో మరో కథ చెప్తున్నావని ఫైర్ అయ్యాడు. గడిచిన పదేళ్లలో ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచం ఎంతో ఎదిగింది. సైమండ్స్ మాత్రం ఎదగలేదనే అర్థం వచ్చేలా భజ్జీ సెటైర్ వేశాడు.