ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (17:15 IST)

పీఎం మోదీపై సయీద్ అన్వర్ కామెంట్స్ వైరల్

Modi
భారత ప్రధాన నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అజాన్ ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 
 
మసీదులా కనిపిస్తున్న ఓ ప్రదేశంలో జన సమూహం ముందు భారత ప్రధానిపై అవాకులు పేల్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఓ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. సమీపంలో ఓ మసీదులో  అజాన్ ఇచ్చారు. 
 
ముస్లిం మనోభావాలను గౌరవిస్తూ.. కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపి వేశారు. మోదీ ఇలా చేయడాన్ని ఉద్దేశిస్తూ అన్వర్ వివదాస్పద వ్యాఖ్యలు చేశాడు.