ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (16:25 IST)

విశాఖ సమ్మిట్ సక్సెస్... మంత్రులను అభినందించిన సీఎం

Jagan
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. 
 
సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరక్టర్ డా.జి. సృజన తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విశాఖ సదస్సును విజయవంతం చేసినందుకు గాను సీఎం మంత్రులను అభినందించారు. 
 
కాగా మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.