మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (11:34 IST)

కర్నూలు జిల్లాలో కంపించిన భూమి

earthquake
కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పోస్టాఫీసు ప్రాంతంలో దాదాపు 14 గోడలు, పైకప్పులకు చీలికలు వచ్చాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామంలో సోమవారం భూమి కంపించింది. సిమెంట్‌ రోడ్లు కూడా నెర్రెలు ఇచ్చాయి.
 
వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రవి గ్రామానికి వచ్చి పగుళ్లు వచ్చిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు పగుళ్లు వచ్చి నష్టపోయినవారికి పరిహారం అందేలా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.