గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (10:38 IST)

రేకులకుంట వద్ద ఘోరం.. నలుగురు దుర్మరణం

road accident
ఏపీలోని అనంతపురం జిల్లా రేకులకుంట వద్ద ఘోరం జరిగింది. ఓ కారును లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం, రేకులకుంట వద్ద శనివారం అర్థరాత్రి నార్పల వైపు వెళుతున్న కారును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంరో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంలో చనిపోయినవారిని అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.