గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 జులై 2024 (19:09 IST)

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి వ్యక్తి మృతి (video)

man died after collapsing due to heart attack
జిమ్‌లో అందరితో కలిసి వ్యాయామం చేస్తున్నాడు. ఐతే వున్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడితో పాటు వ్యాయామం చేస్తున్నవారు వెంటనే స్పందించి అతడిని లేపేందుకు ప్రయత్నించినా అతడు లేవలేదు. ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు.
 
పూర్తి వివరాలు చూస్తే... మహారాష్ట్రలోని శంభాజీ నగర్ లో పలువురు కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వ్యాయామంలో భాగంగా కాస్త పైకి ఎగురుతూ ఎగురుతూ అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే వ్యాయామం చేయడం ఆపి వెనక్కి జరిగాడు. కానీ అంతలోనే అతడు కుప్పకూలిపోయాడు. అది గమనించిన తోటివారు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.