గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే 5 రోజువారీ అలవాట్లు, ఏంటవి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము.
ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి.
పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి.
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి.
ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి.
గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి.
రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.