శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మార్చి 2024 (08:59 IST)

48వ ఏటనే గుండెపోటుతో తమిళ నటుడు డేనియల్ బాలాజీ మృతి

Daniel Balaji
Daniel Balaji
తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. కోలీవుడ్‌లో ప్రతినాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసిన డేనియల్ బాలాజీ.. 48వ ఏటనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మెగా సీరియల్ "చిత్తి," "కాఖా కాఖా, "వడ చెన్నై", వేట్టైయాడు విలయాడు వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన డేనియల్ బాలాజీ గుండెపోటు కారణంగా మరణించారు.
 
"చిత్తి"తో టెలివిజన్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, అతను వెండితెరపైకి వచ్చాడు. తమిళం, తెలుగు, మలయాళంలో 40 చిత్రాలతో చెరగని ముద్ర వేశారు. డేనియల్ తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ ఘర్షణ ,నాని యొక్క టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించాడు. అతని ఆకస్మిక మరణం పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.