గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జులై 2024 (15:02 IST)

గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన టెన్త్ విద్యార్థి.. నడుస్తూ వెళ్తుండగా..?

Tenth class student
Tenth class student
గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజుకి పెరిగిపోతోంది. వయోబేధం లేకుండా గుండెపోటుకు గురవుతూ ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ టెన్త్ విద్యార్థి గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
రాజస్థాన్ - దౌసాలో ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న యతేంద్ర ఉపాధ్యాయ్(16) క్లాసులోకి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. 
 
సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.