శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (19:44 IST)

దేశంలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. ఎక్కువ వర్షపాతం నమోదు

rain
దేశంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించాయి. జూలై 8న దేశంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఆరు రోజులు ముందుగానే అంటే జూలై 2న దేశంలోకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ఊపందుకున్నందున జూలైలో దేశంలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. 
 
రుతుపవనాలు మే 30న కేరళ, ఈశాన్య ప్రాంతాలకు ముందుగానే వచ్చాయి. అయితే మహారాష్ట్రలో దాని పురోగతి మందగించింది. దేశంలో జూన్ 11 నుండి జూన్ 27 వరకు 16 రోజులు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 
 
దేశంలోని దాదాపు 50 శాతం వ్యవసాయ భూములకు ఇతర నీటిపారుదల వనరులు లేనందున రుతుపవనాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోని రిజర్వాయర్‌లు, జలాశయాలు నిండేందుకు రుతుపవనాల వర్షాలు కూడా కీలకం. ఈ నీటిని పంటలకు సాగునీరు అందించడానికి సంవత్సరం తరువాత ఉపయోగించవచ్చు.
 
ఈ నేపథ్యంలో రాబోయే 4-5 రోజులలో వాయువ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో "చురుకైన రుతుపవనాల పరిస్థితి" చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. జూలై 6న ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
 
ఇంకా కేరళ, మహే, లక్షద్వీప్, కోస్టల్ కర్నాటక, కొంకణ్, గోవా, గుజరాత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం వుంటుంది. మధ్య మహారాష్ట్ర, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, కర్ణాటకలో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం వుంది. రానున్న ఐదు రోజుల్లో మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, రాయలసీమ, తెలంగాణలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.