1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 15 మే 2024 (09:46 IST)

ఘోరం, ఓటు వేయడానికి వచ్చి బస్సు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం - video

bus fire
పల్నాడు జిల్లా చిలుకలూరి పేట మండలం ఈపూరిపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రైవేట్ బస్సుని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీనితో ఐదుగురు వ్యక్తులు బస్సులో సజీవదహనమయ్యారు. పూర్తి వివరాలు చూస్తే... బాపట్ల జిల్లా చినగంజాము నుంచి చీరాల మీదుగా బస్సు హైదరాబాదు వెళ్తోంది. ఈ బస్సులోని వారంతా తమ నియోజకవర్గంలో ఓట్లు వేసి తిరిగి వెళుతున్నారు.
 
ఈ క్రమంలో బస్సు ఈపూరిపాలంకి చేరుకోగానే వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. టిప్పర్ లో చెలరేగిన మంటలు బస్సుకి అంటుకున్నాయి. దీనితో క్షణకాలంలోనే మంటలు బస్సులో వ్యాపించాయి. పలువురు తప్పించుకున్నప్పటికీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు సజీవ దహనమయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.