శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 27 జనవరి 2019 (20:36 IST)

జేసీ దివాకర్ రెడ్డికి ఏకుమేకుగా మారిన మాజీ సిఐ

అనంతపురం జిల్లా గోరంట్ల పోలీస్టేషన్‌కు చెందిన సిఐ గోరంట్ల మాధవ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. టిడిపి ఎంపి జె.సి.దివాకర్ రెడ్డికి సవాల్ విసురుతూ పోలీసులు ఆడంగులు కాదు చేతులు కట్టుకుని కూర్చోమంటూ మీసం తిప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన వ్యక్తి. అప్పట్లో గోరంట్ల మాధవ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసు అధికారిగా ఉన్న మాధవ్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం సాగింది.
 
అయితే తన పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ వైసిపిలో చేరిపోయారు. హైదరాబాద్‌కు వెళ్ళిన గోరంట్ల మాధవ్ నేరుగా వైఎస్ ఆర్ సిపి పార్టీ కార్యాలయానికి వెళ్ళి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. 
 
నిజాయితీ కలిగిన పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈసారి జె.సి.దివాకర్ రెడ్డికి కష్టమేనని ఆ పార్టీ నేతలనే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.