మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (14:29 IST)

తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావిరవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ప్రస్తుతం రావి మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి తెనాలిలోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు.

బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైఎస్ కి రావిరవీంద్రనాథ్ చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయనతో కలిసి ఎంబీబీఎస్ చదువుకున్నారు. వైఎస్సార్ రాజకీయాల్లోకి వచ్చాక రావి కూడా వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెనాలి ఎమ్మెల్యేగా, రెండు సార్లు తెనాలి మున్సిపల్ ఛైర్మన్‌గా చౌదరి పనిచేశారు.