శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జులై 2020 (10:04 IST)

మనోధైర్యాన్ని మించిన మందు లేదు: గౌతం సవాంగ్

గత కొన్ని నెలలుగా కోవిడ్-19 వ్యాప్తి నుండి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా  విధులు నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది పోలీస్ సిబ్బంది కరోనా వైరస్ భారీన పడి, చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధులో చేరడం ఎంతో అభినందనీయమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ అన్నారు.

తాజాగా కొవిడ్ మాహమ్మరి పై యుద్ధంలో విజయం సాధించిన దిశ స్పెషల్ ఆఫీసర్, బేటాలియన్స్ ఎస్‌పి దీపికా పాటిల్, డి‌సి‌పి విక్రాంత్ పాటిల్ దంపతులను గౌతం సవాంగ్ స్వాగతం పలికారు.
 
గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ కరోనా వైరస్ బారిన పడి సరైన సమయంలో గుర్తించి వైద్య చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా సిబ్బంది తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

వైరస్ ను జయించిన పోలీస్ సిబ్బంది ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని, కోవిడ్ బాధితులలో మానసిక స్థైర్యం నింపాలని సూచించారు.