ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:15 IST)

ఏపీలో 4 రోజుల ప‌ర్య‌ట‌న‌... విజ‌య‌వాడ‌కు రానున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 30న ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. ఆయ‌న కుమార్తె ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి ఆయ‌న ప్ర‌త్యేకంగా వ‌స్తున్నారు. దీనితో పాటు నాలుగు రోజులు వివిధ కార్య‌క్ర‌మాల్లో వెంక‌య్య పాల్గొంటున్నారు.
 
కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో 30న నిర్వహించే డాక్టర్‌ ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఉప రాష్ట్ర‌ప‌తి పాల్గొంటారు. 31న విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రామ్మోహన్‌ గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. నవంబరు 1న చినఆవుటపల్లిలోని డాక్టర్‌ పిన్నమనేని సిద్థార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
న‌వంబరు ఒక‌టిన సాయంత్రం ఐఐపీఏ సర్వసభ్య సమావేశానికి వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతారు. నవంబరు 2న గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్క‌డి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ‌తారు.